Featured posts

Latest posts

All
technology
science

నిద్ర లేవగానే ఆ పని చేస్తున్నారా ?

మనలో చాలా మంది ఉదయం నిద్ర లేవగానే ఫోన్ చూస్తూ..రోజును ప్రారంభిస్తారు. అంతేనా తినేటప్పుడు, పడుకునేటప్పుడు సైతం ఫోన్‌ని వదిలిపెట్టడం లేదు. అయితే ఈ రకమైన అలవాటు చాలా ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. మరికొంతమంది అయితే ఫోన్‌ని దిండు కింద పెట్టుకుని మరీ నిద్రపోతుంటారు. ఈ అలవాటు వల్ల భారీ నష్టం చవిచూడాల్సి వస్తుందట. పైగా దీనిపై WHO కూడా హెచ్చరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయం ప్రకారం.. 90 శాతం మంది యువకులు, 68 శాతం…

Read More

మంగళసూత్రానికి నిజంగా అంత పవర్ ఉందా..?

సనాతన ధర్మాన్ని నమ్మే వివాహిత మహిళలకు మంగళసూత్రం చాలా ముఖ్యమైనది. హిందూ సంస్కృతి, సాంప్రదాయాల ప్రకారం వివాహానంతరం మహిళలు మంగళసూత్రాన్ని ధరించడం వారి వైవాహిక స్థితిని ప్రపంచానికి తెలియజేస్తుంది. వివాహమైన తర్వాత స్త్రీలు కళ్యాణపు ఉంగరాన్ని, కాలిమెట్టలను, మంగళ సూత్రాన్ని ధరించడం, నుదుటిపై కుంకుమ పెట్టుకోవడం కుటుంబాన్ని నిర్వహించగలిగిన సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. వీటిలో ముఖ్యంగా మంగళసూత్రం అత్యంత విలువైన ఆభరణంగా పరిగణించబడుతుంది. మంగళసూత్రాన్ని ఎల్లప్పుడూ నల్లపూసలు మరియు దారంతో కట్టి ఉంచుతారు. ఈ నల్ల పూసలకు కూడా…

Read More

పేదింటి అమ్మాయికి కంటి చూపు ప్రసాదించిన సోనూసూద్

మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లా కోపర్‌గావ్ కి చెందిన గాయత్రి థోరట్ అనే బాలిక చిన్నతనంలో జరిగిన ఓ ప్రమాదం కారణంగా కంటి చూపు కోల్పోయింది. రెండున్నరేళ్ల వయసులో ఎడమ కంటిలో ప్రమాదవశాత్తూ సున్నం పడడంతో దృష్టి కోల్పోయింది. కేవలం కుడి కన్నుతోనే అన్ని పనులు చేసుకునేది. గాయత్రికి కంటి చూపు తిరిగి తెప్పించడానికి తండ్రి దశరథ్, సోదరుడు కార్తీక్ థోరట్ తీవ్రంగా ప్రయత్నించారు. కానీ శస్త్రచికిత్స కోసం లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. దీంతో గాయత్రికి కంటి…

Read More

బాపట్లలో విషాదం..నడుముకు బాటిళ్లను కట్టుకుని..?

బాపట్ల జిల్లా పర్చూరులోని వీరన్నపాలేంలో విషాద ఘటన చోటుచేసుకుంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న పాలేరు జస్వంత్, ఇంటర్ సెకండియర్ చదువుతున్న మణికంఠ, డిప్లొమా చదువుతున్న రామరాజు ముగ్గురు ప్రాణ స్నేహితులు. వీరు ముగ్గురు ఖాళీ వాటర్ బాటిళ్లను నడుముకు కట్టుకుని నీటిలో దిగారు. ఆ సమయంలో జస్వంత్ కట్టుకున్న బాటిళ్ల తాడు ఊడిపోవడంతో లోతైన చెరువు నీటిలో మునిగి గల్లంతయ్యాడు. మణికంఠ, రామరాజు ఒడ్డుకి చేరుకొని ఒక్కసారిగా కేకలు వేయడంతో గ్రామస్తులు అందరూ అక్కడికి చేరుకుని…

Read More

తండ్రి సినిమా షూటింగ్ చూద్దామని వస్తే..?

తను ఒక స్టార్ హీరో కొడుకు అయినా ఆ అహంకారాన్ని ఎప్పుడూ చూపించలేదు. ఇంట్లో లగ్జరీ కార్ల కలెక్షన్ ఉన్నప్పటికీ.. బస్సు, రైలులోనే ప్రయాణం.. ఆ రైలులో కూడా స్లీపర్, జనరల్ కంపార్ట్‌మెంట్‌లోనే ఎక్కువగా ప్రయాణిస్తాడు. ఇంతకి ఆ స్టార్ హీరో ఎవరూ అయినా కొడుకు ఎవరో తెలుసుకుకోవాలని ఉందా. అయితే ఈ వార్తను చదవండి. నేను రాసిన ఈ వార్త మోహన్ లాల్ కొడుకు గురించి. నిర్మాత, నటుడు, దర్శకుడు అలెప్పీ అష్రాఫ్ తనకు ఎదురైన…

Read More

నడుం నొప్పి పోవాలంటే ఏం చేయాలి ?

మనలో చాలా మంది నేలపైన కాకుండా బెడ్ పైన పడుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. వీళ్లు అందరూ చెప్పే కారణం ఒక్కటే రోజంతా కష్టపడి మెత్తటి బెడ్ పై పడుకుంటే హాయిగా నిద్రపడుతుందని.. ఇందుకోసం వేలకు వేలు ఖర్చు పెట్టి బెడ్స్ ను కొనుగోలు చేస్తుంటారు. కానీ బెడ్ పై పడుకోవడం కంటే నేలపై పడుకుంటేనే చాలా బెటర్ అని మీకు తెలుసా..? సాధారణంగా భుజం నొప్పి, లేదా ఇతర కండరాల నొప్పులతో బాధపడే వారిని నేలపై…

Read More

ఆదివారం అర్ధరాత్రి ఒక్కసారిగా కుప్పకూలిన భవనం

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఘోరం జరిగింది. గార్డెన్ రీచ్ ఏరియాలోని ఓ కాలనీలో ఆదివారం అర్ధరాత్రి దాటాక నిర్మాణంలో ఉన్న 5వ అంతస్తుల భవనం కుప్పకూలింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని..క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. పది మందిని రక్షించగలిగారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More

మగవాళ్లకు మాత్రమే..ఆ సమస్యకు చెక్ పెట్టండిలా..!

వింటర్ సీజన్ లో ఆకు కూరలు తింటే చర్మానికి, ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలిసిందే. ఆకు కూరలన్నీ ఆరోగ్యానికి మంచివే కానీ.. ఈ ఆకు కూర తింటే మాత్రం మగవాళ్లకు ఎంతో హెల్ప్ అవుతుంది. అదే పొన్నగంటి కూర.. దీంట్లో శరీరానికి అవసరమైన అనేక పోషకాలు ఉన్నాయి. మగవారు ఈ ఆకుకూర ఒక్కటి తింటే.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ కూరలో విటమిన్లు సి, ఎ, బి6, ఫొలేట్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, రైబోఫ్లవిన్ వంటి…

Read More

స్వెటర్‌ వేసుకొని నిద్రిస్తున్నారా..?

వింటర్ లో చ‌లిని త‌ట్టుకుని ఉండేందుకు చిన్నా, పెద్ద అంద‌రూ రాత్రింబ‌గ‌ళ్లు స్వెట‌ర్స్ ధ‌రిస్తారు. కొంతమందికి అయితే స్వెట‌ర్ వేసుకొని మరీ నిద్రించే అల‌వాటు ఉంటోంది. అయితే స్వెట‌ర్ వేసుకొని నిద్రించ‌డం మంచిది కాద‌ని అంటున్నారు వైద్య నిపుణులు.  స్వెట‌ర్ వేసుకుని నిద్రించ‌డం వ‌ల్ల శ‌రీర ఉష్ణోగ్రతలు బ‌య‌ట‌కు వెళ్ల‌లేక‌పోతాయట. దాంతో ర‌క్త పోటు స్థాయిలు పెర‌గ‌డం లేదా త‌గ్గ‌డం వంటివి జ‌రుగుతాయి. ఫ‌లితంగా క‌ళ్లు తిర‌గ‌డం, మైకం, త‌ల నొప్పి వంటి స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయంటున్నారు నిపుణులు….

Read More