ప్రతి రోజు ఇవి తింటే అద్భుత ప్రయోజనాలు..!
యాలకుల్లో ఎన్నో ఔషధాలు గుణాలు ఉండడం వల్ల వాటిని తినాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తుంటారు. యాలకుల్లో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. సాధారణంగా స్వీట్స్, పులావ్, బిర్యానీ, హల్వాలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. రుచి కోసం అనే చాలా వరకు తెలుసు కానీ మనకు తెలియని ఔషధాల గుణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
యాలకులు తినడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది. అలాగే నిత్యం నమలడం వల్ల నోటి దుర్వాసన పోయి నోరు తాజాగా ఉంటుంది. దంత సమస్యలు కూడా దూరమవుతాయి. ఇవి తినడం వల్ల రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది. గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందట. అంతేనా .. మగవారు ప్రతిరోజు 2 యాలకులు తింటే పురుషుల్లో నపుంసకత్వం దూరమవుతుందట. లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. వీటిని వీడిగా లేదా.. పాలతో కలిపి తీసుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అసలు మ్యాటర్ ఇదే అండి.
గమనిక: ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాం. ఫాలో అయ్యే ముందు వైద్యుల్ని సంప్రదించడం మేలు.