హెచ్చరిక..మీకు ఆ అలవాటు ఉందా..?
మనలో చాలా మంది రాత్రి ఆలస్యంగా పడుకుంటారు. కొంత మంది రాత్రి పూట అధిక సమయం వేచివుండి వర్క్ చేస్తుంటారు. మరికొంతమంది మాత్రం సోషల్ మీడియాలో గంటల కొద్ది సమయం గడుపుతూ మేల్కొని ఉంటారు. అయితే దీని వల్ల మన శరీర గడియారంలో అనేక దుష్ప్రభావాలు పడుతాయని వైద్య నిపుణులు అంటున్నారు. మన శరీరానికి దాని సొంత గడియారం ఉంటుందట. ఆ రొటీన్లో ఒక్కసారి బ్రేక్ పడితే ఇక అంతే సంగతి..చక్కదిద్దుకోవడానికి చాలా కష్ట పడాల్సి వస్తుందంటున్నారు. రాత్రి ఆలస్యంగా నిద్రిస్తే..ఊబకాయం, గుండె జబ్బులు వంటి ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మీరు ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య నిద్రపోవడం అలవాటు చేసుకోండి అంటున్నారు. ప్రతిరోజూ రాత్రి 1-2 గంటలకు పడుకుంటే శరీరంలో జీవక్రియ రేటు తగ్గుతుందట. ఫలితంగా బరువు పెరిగే ప్రమాదం ఉందంటున్నారు. రాత్రిపూట 9 గంటలకు మించి నిద్రపోకూడదు. శరీరంలో కొవ్వు కూడా పేరుకుపోతుంది. ఇది సంగతి అర్ధమైంది కదా..ఈరోజు నుండి మీ నిద్ర దినచర్యను మార్చుకోవడం అలవాటు చేసుకోండి. రాత్రి తొందరగా పడుకుని, ఉదయం తొందరగా నిద్రలేవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాం. ఫాలో అయ్యే ముందు వైద్యుల్ని సంప్రదించడం మేలు.