ఆ సమస్యలకు చెక్ పెట్టండిలా..!

ప్రస్తుత కాలంలో అజీర్తి, గ్యాస్‌ సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. జంక్‌ఫుడ్స్‌, ఫాస్ట్‌ఫుడ్స్‌ లాంటి ఆహార పదార్థాలు తరచూ తీసుకోవడం వల్ల జీర్ణాశయానికి సంబంధించిన గ్యాస్‌, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం తదితర సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యల నుంచి త్వరగా బయటపడడానికి మనం ఇంట్లో సులువుగా కొన్ని చిట్కాలను ఉపయోగించి ఉపశమనం పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మన ఇంట్లో ఉండే వాముతో జీర్ణాశయ ఇబ్బందులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చట. వాము వల్ల జీర్ణాశయానికి చాలా లాభాలు ఉన్నాయంటున్నారు. అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్‌ మొదలైన సమస్యలను దూరం చేస్తుందట. జీర్ణక్రియలో ఇబ్బందులను తొలగించి జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. కడుపునొప్పిని తగ్గిస్తుంది. వామును నిమ్మరంతో కలపి తీసుకుంటే హైడ్రోక్లోరిన్‌ యాసిడ్‌ పునరుద్ధరించబడి ఆహారం త్వరగా జీర్ణమవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

గమనిక: ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాం. ఫాలో అయ్యే ముందు వైద్యుల్ని సంప్రదించడం మేలు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *