మీ కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా ?

మనలో చాలా మంది కళ్లపట్ల ఆ జాగ్రత్తగా ఉంటారు. అనవసరంగా గంటల తరబడి ఫోన్లు, ల్యాప్ టాప్ ల ముందు కూర్చుని కళ్లకు రక్షణ, రెస్ట్ లేకుండా చేస్తున్నారు. దీంతో కళ్ల రక్షణ కణాలు దెబ్బతింటున్నాయి. చాలా మంది చిన్నపిల్లలకు కూడా తొందరగా సైట్ వచ్చేస్తుంది. ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్లు స్క్రీన్ ని అదే పలంగా గంటల తరబడి చూడటం వల్ల కళ్లపై ఎక్కువగా ఒత్తిడి పడుతుంది. కాబట్టి కళ్లను కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. కళ్ల ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.   

కంటి ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో కివీ ఒకటి. అతినీల లోహిత కిరణాల నుండి కివీ మనల్ని రక్షిస్తుంది. అలాగే బాదం, వాల్ నట్స్, ఇతర అన్ని రకాల వాల్ నట్స్ లో కూడా విటమిన్స్ సి, ఈ, జింక్, ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి కళ్లకు ఆక్సీకరణ నష్టం నుండి రక్షణ కల్పిస్తాయి. కోడి గుడ్లు కూడా కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. అలాగే రెటీనాను కూడా దెబ్బతీయకుండా హానికరమైన నీలి కాంతిని ఎదుర్కోవడంలో హెల్ప్ చేస్తుంది. కళ్లు ఎప్పుడూ ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కూడా తినడం చాలా ముఖ్యం. వీటిల్లో కంటి ఆరోగ్యానికి అవసరమైన ఐరన్, విటమిన్లు అధికంగా ఉంటాయి. బచ్చలి కూర, కాలే, బ్రోకలీ కంటి చూపును బలపరుస్తాయి. కాబట్టి మీ ఆహారంలో వీటిని కూడా వారానికి ఒక్కసారైనా చేర్చుకుంటే మీ కళ్లు హెల్దీగా ఉంటాయి.

గమనిక: ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాం. ఫాలో అయ్యే ముందు వైద్యుల్ని సంప్రదించడం మేలు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *