వింటర్ లో స్కిన్ డ్రైగా మారుతుందా..?  

చలికాలంలో మన చర్మం డ్రైగా, పొలుసు బారినట్టు మారిపోతుంది. అలాగే తేమ కూడా తగ్గిపోయి.. నిర్జీవంగా మారుతుంది. చలి గాలుల వల్ల పగలటం, పొడి బారటం, మంట పెట్టడం, దురద పెట్టడం వంటి సమస్యలు తలెత్తుతాయి. డ్రై స్కిన్ ఉన్న వారికి మరీ ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి వారు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి వద్దే ఉండే వాటితో కొన్ని రకాల టిప్స్ పాటిస్తే చాలు. అవేంటో తెలుసుకుందాం.

కొబ్బరి నూనె..ఇది మన స్కిన్ కేర్ లో చాలా ముఖ్యమైనది. ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగిన డ్యామేజ్ ను తగ్గిస్తుంది. అలాగే స్కిన్ యంగ్ గా కనిపించేలా చేస్తుంది. రాత్రి పడుకునే ముందు కొద్దిగా కొబ్బరి నూనె మసాజ్ చేసుకుని..ఉదయాన్నే స్నానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మాయిశ్చరైజర్ ను కూడా మార్చాలి. సాధారణంగా వర్షా కాలం, వేసవి కాలంలో రాసుకునే మాయిశ్చరైజర్స్ కంటే చలి కాలంలో ఇంకా రిచ్ గా, ఆయిల్ బేస్ ఉండే క్రీములు రాసుకోవాలి. వీలైనంత వరకు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడటం బెటర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *