నిద్ర లేవగానే ఆ పని చేస్తున్నారా ?
మనలో చాలా మంది ఉదయం నిద్ర లేవగానే ఫోన్ చూస్తూ..రోజును ప్రారంభిస్తారు. అంతేనా తినేటప్పుడు, పడుకునేటప్పుడు సైతం ఫోన్ని వదిలిపెట్టడం లేదు. అయితే ఈ రకమైన అలవాటు చాలా ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. మరికొంతమంది అయితే ఫోన్ని దిండు కింద పెట్టుకుని మరీ నిద్రపోతుంటారు. ఈ అలవాటు వల్ల భారీ నష్టం చవిచూడాల్సి వస్తుందట. పైగా దీనిపై WHO కూడా హెచ్చరించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయం ప్రకారం.. 90 శాతం మంది యువకులు, 68 శాతం మంది పెద్దలు నిద్రించే సమయంలో తమ దిండు కింద మొబైల్ ఫోన్ పెట్టుకుని నిద్రపోతున్నారట. మొబైల్ ఫోన్ని దిండు కింద పెట్టుకుని పడుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. మొబైల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ ఆరోగ్యానికి ప్రమాదకరం. అందుకే నిద్రపోయేటప్పుడు స్మార్ట్ఫోన్ను దూరంగా ఉంచడం మంచిది. వీలైతే, నిద్రపోయేటప్పుడు మొబైల్ ఫోన్లను కనీసం 3 అడుగుల దూరంలో ఉంచడానికి ప్రయత్నించండి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల మొబైల్ విడుదల చేసే రేడియో ఫ్రీక్వెన్సీ విద్యుదయస్కాంత శక్తి తగ్గుతుంది.
మొబైల్ ఫోన్లను పక్కన పెట్టుకుని పడుకోవడం వల్ల కలిగే మరో ప్రమాదం.. మొబైల్ ఫోన్లు విడుదల చేసే రేడియేషన్ వల్ల కండరాల నొప్పులు, తలనొప్పికి దారితీస్తుంది. మొబైల్ ఫోన్ల నుంచి వచ్చే నీలి కాంతి నిద్రను ప్రేరేపించే హార్మోన్లను దెబ్బతీస్తుంది. ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది. సో వీలైనంత వరకు ఫోన్ పక్కనే పెట్టి పడుకోకండి.