మగవాళ్లకు మాత్రమే..ఆ సమస్యకు చెక్ పెట్టండిలా..!
వింటర్ సీజన్ లో ఆకు కూరలు తింటే చర్మానికి, ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలిసిందే. ఆకు కూరలన్నీ ఆరోగ్యానికి మంచివే కానీ.. ఈ ఆకు కూర తింటే మాత్రం మగవాళ్లకు ఎంతో హెల్ప్ అవుతుంది. అదే పొన్నగంటి కూర.. దీంట్లో శరీరానికి అవసరమైన అనేక పోషకాలు ఉన్నాయి. మగవారు ఈ ఆకుకూర ఒక్కటి తింటే.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ కూరలో విటమిన్లు సి, ఎ, బి6, ఫొలేట్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, రైబోఫ్లవిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఎనర్జీ లెవల్స్ కూడా పెరుగుతాయి.
పొన్నగంటి కూర తింటే పురుషులకు కావాల్సిన శక్తి సమకూరుతుంది. ముఖ్యంగా ఇందులో లైంగిక సామర్థ్యాన్ని పెంచే పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. అదే విధంగా ఈ కూర తింటే బరువును నియంత్రించడమే కాకుండా, క్యాన్సర్ ను నయం చేస్తుంది. ఈ కూర ఒక టేబుల్ స్పూన్ రసాన్ని.. వెల్లుల్లితో కలిపి తీసుకుంటే ఆస్తమా, దగ్గు వంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే వెన్ను నొప్పి, నరాల్లలో నొప్పికి మంచి ఔషధంగా పని చేస్తుంది.