పేదింటి అమ్మాయికి కంటి చూపు ప్రసాదించిన సోనూసూద్
మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లా కోపర్‌గావ్ కి చెందిన గాయత్రి థోరట్ అనే బాలిక చిన్నతనంలో జరిగిన ఓ ప్రమాదం కారణంగా కంటి చూపు కోల్పోయింది. రెండున్నరేళ్ల వయసులో ఎడమ కంటిలో ప్రమాదవశాత్తూ సున్నం పడడంతో దృష్టి కోల్పోయింది. కేవలం కుడి కన్నుతోనే అన్ని పనులు చేసుకునేది. గాయత్రికి కంటి చూపు తిరిగి తెప్పించడానికి తండ్రి దశరథ్, సోదరుడు కార్తీక్ థోరట్ తీవ్రంగా ప్రయత్నించారు. కానీ శస్త్రచికిత్స కోసం లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. దీంతో గాయత్రికి కంటి…