నడుం నొప్పి పోవాలంటే ఏం చేయాలి ?
మనలో చాలా మంది నేలపైన కాకుండా బెడ్ పైన పడుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. వీళ్లు అందరూ చెప్పే కారణం ఒక్కటే రోజంతా కష్టపడి మెత్తటి బెడ్ పై పడుకుంటే హాయిగా నిద్రపడుతుందని.. ఇందుకోసం వేలకు వేలు ఖర్చు పెట్టి బెడ్స్ ను కొనుగోలు చేస్తుంటారు. కానీ బెడ్ పై పడుకోవడం కంటే నేలపై పడుకుంటేనే చాలా బెటర్ అని మీకు తెలుసా..? సాధారణంగా భుజం నొప్పి, లేదా ఇతర కండరాల నొప్పులతో బాధపడే వారిని నేలపై పడుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వెన్ను నొప్పితో ఇబ్బంది పడే వారు నేలపై పడుకోవాలంటున్నారు. బెడ్‌పై పడుకోవడం వల్ల నిద్ర భంగిమల్లో మార్పులు జరగుతుంటాయి. అయితే నేల మీద పడుకోవడం వల్ల నిద్ర భంగిమ సరిగ్గా ఉంటుంది. దీంతో వెన్నునొప్పికి చెక్ పెట్టొచ్చు.
నేలపై పడుకోవడం వల్ల హిప్ ఫ్లెక్సర్లు, హామ్ స్ట్రింగ్స్కు ఉపశమనం లభించి నడుం నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. సాధారణంగా మార్నింట్ టైమ్ లో కొందరు సరైన పొజిషన్లో కూర్చొరు. ముఖ్యంగా ఆఫీసుల్లో గంటలతరబడి కూర్చునే వారు సరైన భంగిమలో కూర్చొని కారణంగా మెడ, నడుం నొప్పితో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారు నేలపై పడుకుంటే ఉపశమనం లభిస్తుందట. నేలపై నిటారుగా నడుం ఉంచి పడుకుంటే నడుం, మెడనొప్పి తగ్గుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.