పేదింటి అమ్మాయికి కంటి చూపు ప్రసాదించిన సోనూసూద్
మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లా కోపర్‌గావ్ కి చెందిన గాయత్రి థోరట్ అనే బాలిక చిన్నతనంలో జరిగిన ఓ ప్రమాదం కారణంగా కంటి చూపు కోల్పోయింది. రెండున్నరేళ్ల వయసులో ఎడమ కంటిలో ప్రమాదవశాత్తూ సున్నం పడడంతో దృష్టి కోల్పోయింది. కేవలం కుడి కన్నుతోనే అన్ని పనులు చేసుకునేది. గాయత్రికి కంటి చూపు తిరిగి తెప్పించడానికి తండ్రి దశరథ్, సోదరుడు కార్తీక్ థోరట్ తీవ్రంగా ప్రయత్నించారు. కానీ శస్త్రచికిత్స కోసం లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. దీంతో గాయత్రికి కంటి చికిత్స ఆగిపోయింది.
కోపర్‌గావ్‌కు చెందిన సామాజిక కార్యకర్త వినోద్ రక్షే గాయత్రి విషయాన్ని సోనూసూద్ దగ్గరకు తీసుకెళ్లాడు. స్పందించిన నటులు వెంటనే పేదింటి బాలిక కంటి శస్త్ర చికిత్స కోసం అవసరమైన సాయం చేశాడు. కంటి చూపు తిరిగి వచ్చిన తర్వాత గాయత్రి సోనూసూద్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. సోనూసూద్ సార్ నాకు కంటి చూపు ప్రసాదించారు. ఆయన చేసిన సహాయం ఎన్నటికీ మరువలేనిది. అందుకు ప్రత్యేక ధన్యవాదాలు. కృతజ్ఞతలు చెప్పడానికి నా పదాలు సరిపోవు. దేవుడు సోనూ సార్ ను చల్లగా చూడాలి అని కోరుకుంటోంది గాయత్రి.