మీకు ఆ అలవాటు ఉందా..!
మనలో చాలా మందికి భోజనం చేసే సమయంలో ఫోన్, టీవీ చూసే అలవాటు ఉంటుంది. అయితే ఈ అలవాటు కారణంగా చాలా సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు అంటున్నారు. పెద్దలు, పిల్లలు అందరూ ఈ అలవాటును వెంటనే ఆపాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. దీనివల్ల కంటి బలహీనత, ఊబకాయం, పొట్ట సమస్యలు, గ్యాస్ సమస్యలు, ఒత్తిడి, టెన్షన్ వంటి అనేక సమస్యలు వస్తాయట. ఇలా టీవీ లేదా ఫోన్ చూడటం వల్ల ఆహారంపై దృష్టి సారించలేకపోతుంటారు. ఫలితంగా, వారు తమ ఆహారాన్ని నమలడానికి బదులుగా మింగేస్తారు. దీని వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. మరి రాత్రిపూట ఇలా తింటే నిద్రకు భంగం కలుగుతుంది. అంతేకాదు.. ఈ అలవాటు ఉన్నవాళ్లు వాళ్లకు తెలియకుండానే అతిగా తినేస్తుంటారు. దీని వల్ల తిన్న ఆహారం జీర్ణం కాదు. ఒక్కోసారి ఊపిరి పీల్చుకోలేని పరిస్థితులు కూడా ఎదురవుతాయట. కాబట్టి వీలైనంత వరకు భోజనం చేస్తూ టీవీ, ఫోన్ చూడటం మానేస్తే మంచిదంటున్నారు వైద్య నిపుణులు.