ప్రజలను మైమరిపిస్తున్న అండర్ వాటర్ మెట్రో !
దేశంలోనే మొట్టమొదటి నదీ గర్భ మెట్రో.. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో నిర్మించిన ఈ నదీగర్భ మెట్రోను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవలే ప్రారంభించారు. తాజాగా ఈ మెట్రో కార్యకలాపాలు పబ్లిక్‌కు అందుబాటులోకి వచ్చాయి. శుక్రవారం ఉదయం నుంచి మెట్రో రైడ్‌కు ప్రయాణికులను అనుమతిస్తున్నారు. దీంతో ఈ మెట్రోలో ప్రయాణించేందుకు స్థానికులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ అండర్ వాటర్ మెట్రోలో ప్రయాణించి థ్రిల్‌ను ఫీల్ అవుతున్నారు. ఈ మెట్రోను అందుబాటులోకి తెచ్చినందుకు ప్రయాణికులు ముందుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.