ఈ పండును మీరు తింటున్నారా..?
తినేకొద్దీ మళ్లీ మళ్లీ తినాలనిపించే పండు జామ. వీటిని తినడం వల్ల బాడీలో కొలెస్ట్రాల్, రక్త పోటు అదుపులో ఉంచుకోవచ్చు. గుండె సమస్యలు కూడా రావు. చర్మం కూడా యంగ్ గా ఉంటుంది. కానీ కొన్ని రకాల సమస్యలతో బాధపడేవారు వీటికి దూరంగా ఉంటేనే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జామ పండులో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకటి కంటే ఎక్కువగా తింటే మల బద్ధకం, కడుపులో నొప్పి, ఉబ్బరం, గ్యాస్ అజీర్తి వంటి సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది. అందుకని జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడేవారు వీటికి దూరంగా ఉంటేనే చాలా మంచిది.
ఈ పండులో విటమిన్ సి, ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటాయి. గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారు కూడా జామ కాయకు దూరంగా ఉంటేనే మంచిదట. ప్రస్తుతం ఇప్పుడు చాలా మంది డయాబెటీస్ తో ఇబ్బంది పడుతున్నారు. చిన్న వయసులోనే షుగర్ వ్యాధితో బాధ పడాల్సి వస్తుంది. మధు మేహం ఉన్న వారు కూడా జామ కాయను చాలా తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. లేదంటే రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి విపరీతంగా పెరుగుతాయి. ఫ్లూ, జలుబు వంటి ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడే వారు కూడా దూరంగా ఉండాలి. జామ పండును రాత్రి పూట అస్సలు తీసుకోకూడదు. దీని వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాం. ఫాలో అయ్యే ముందు వైద్యుల్ని సంప్రదించడం మేలు.