చలి కాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

బాబోయ్ వింటర్ సీజన్ వచ్చేసింది. వాతావరణంలోనే కాదు.. ఇప్పుడు శరీరంలోనూ కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. చలి తీవ్రతను బట్టి మన శరీరంలో హీట్ అనేది తగ్గిపోతుంది. శరీరం పొడి బారిపోతుంది.. తేమను కోల్పోతుంది. పైగా జుట్టు సమస్యలు కూడా తలెత్తుతాయి. జుట్టు రాలిపోతూ చిరాకుగా ఉంటుంది. ఇవే కాదు ఈ వింటర్ సీజన్ లో తగిన జాగ్రత్తలు తీసుకుకోకుంటే అంతే సంగతి. మనం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ఆహారాలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. 

మనలో చాలా మంది వింటర్ సీజన్ లో వాటర్ ఎక్కువగా తాగరు. వాతావరణం చల్లగా ఉండడంతో తాగేందుకు ఆసక్తి చూపించరు. దీంతో మన శరీరంలో నీరు శాతం అనేది తగ్గిపోతుంది. డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంది. స్కిన్ కూడా పాడవుతుంది. కాబట్టి ఏ కాలం అయినా సరే సరిపడా వాటర్ తాగాలని  నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆహారం విషయానికి వస్తే.. పాలకూర చాలా మంచిది అంటున్నారు నిపుణులు. పాలకూరలో విటమిన్లు ఎ, సిలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. పాలకూర తినడం వల్ల స్కిన్ గ్లోగా తయారవుతుంది. వారానికి ఒక్కసారైనా తీసుకోవడం మంచిదంటున్నారు.

వింటర్ సీజన్ లో విటమిన్ ఎ, సి ఫుడ్స్ ని ఎక్కువగా తీసుకుంటే.. ఇవి చర్మాన్ని, ఆరోగ్యాన్ని కాపాడేందుకు హెల్ప్ అవుతాయి. చిలగడ దుంపలు, చేపలు, క్యారెట్ వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి. స్కిన్ ని హెల్దీగా ఉంచడంలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి మీరు తీసుకునే ఆహారంలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేలా చూసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *