స్వెటర్‌ వేసుకొని నిద్రిస్తున్నారా..?

వింటర్ లో చ‌లిని త‌ట్టుకుని ఉండేందుకు చిన్నా, పెద్ద అంద‌రూ రాత్రింబ‌గ‌ళ్లు స్వెట‌ర్స్ ధ‌రిస్తారు. కొంతమందికి అయితే స్వెట‌ర్ వేసుకొని మరీ నిద్రించే అల‌వాటు ఉంటోంది. అయితే స్వెట‌ర్ వేసుకొని నిద్రించ‌డం మంచిది కాద‌ని అంటున్నారు వైద్య నిపుణులు. 

స్వెట‌ర్ వేసుకుని నిద్రించ‌డం వ‌ల్ల శ‌రీర ఉష్ణోగ్రతలు బ‌య‌ట‌కు వెళ్ల‌లేక‌పోతాయట. దాంతో ర‌క్త పోటు స్థాయిలు పెర‌గ‌డం లేదా త‌గ్గ‌డం వంటివి జ‌రుగుతాయి. ఫ‌లితంగా క‌ళ్లు తిర‌గ‌డం, మైకం, త‌ల నొప్పి వంటి స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయంటున్నారు నిపుణులు. పైగా చ‌ర్మానికి స‌రిగ్గా గాలి త‌గ‌ల‌దు. తేమ కూడా త‌గ్గి పోతుంది. దీంతో చ‌ర్మం పొడి బారి పోయి ఎండిపోయిన‌ట్టు అయిపోతుంది. అంతే కాదు.. ఇలా చేయడం వల్ల శరీరంలో ఆక్సిజన్‌ సరఫరా కూడా త‌గ్గిపోతుంది. ఆక్సిజన్‌ సరఫరా త‌గ్గిపోవ‌డం వ‌ల్ల ఊపిరి పీల్చుకోవడానికి కష్టంగా ఉండటం, ఛాతి నొప్పి పుట్ట‌డం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి వాటిని ఫేస్ చేయాల్సి ఉంటుంది. 

ఇక గుండె సంబంధిత జ‌బ్బుల‌తో బాధప‌డుతున్న వారు, షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు స్వెట‌ర్ వేసుకుని నిద్రించ‌కపోవ‌డ‌మే మంచిద‌ని అంటున్నారు వైద్య నిపుణులు. లేకుంటే ఆయా స‌మ‌స్య‌లు మ‌రింత తీవ్రంగా మారే అవ‌కాశం ఉంటుందట. చ‌లి తీవ్రంగా ఉండి ఖ‌చ్చితంగా స్వెట‌ర్ వేసుకోవాలి అనుకుంటే.. కాస్త పల్చగా ఉండే స్వెటర్ ను ఎంచుకుని వేసుకోవడం మంచిదంటున్నారు. లేకుంటే మీరు నిద్రించే రూమ్ లో రూమ్ హీట‌ర్​ ను ఏర్పాటు చేసుకోవ‌చ్చంటున్నారు. త‌ద్వారా చ‌లి పెట్ట‌కుండా ఉంటుంది. పైగా స్వెట‌ర్ ధరించాల్సిన అవసరం ఉండదంటున్నారు నిపుణులు. 

గమనిక: ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాం. ఫాలో అయ్యే ముందు వైద్యుల్ని సంప్రదించడం మేలు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *