తండ్రి సినిమా షూటింగ్ చూద్దామని వస్తే..?

తను ఒక స్టార్ హీరో కొడుకు అయినా ఆ అహంకారాన్ని ఎప్పుడూ చూపించలేదు. ఇంట్లో లగ్జరీ కార్ల కలెక్షన్ ఉన్నప్పటికీ.. బస్సు, రైలులోనే ప్రయాణం.. ఆ రైలులో కూడా స్లీపర్, జనరల్ కంపార్ట్‌మెంట్‌లోనే ఎక్కువగా ప్రయాణిస్తాడు. ఇంతకి ఆ స్టార్ హీరో ఎవరూ అయినా కొడుకు ఎవరో తెలుసుకుకోవాలని ఉందా. అయితే ఈ వార్తను చదవండి.

నేను రాసిన ఈ వార్త మోహన్ లాల్ కొడుకు గురించి. నిర్మాత, నటుడు, దర్శకుడు అలెప్పీ అష్రాఫ్ తనకు ఎదురైన ఈ ఆసక్తికరమైన అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. మోహన్‌లాల్ దర్శకత్వం వహించిన బారోస్ సినిమా సెట్‌లో తన తండ్రిని కలవడానికి వచ్చిన ప్రణవ్‌ను సెక్యురిటీ ఆపేసారట. స్పెయిన్‌లోని బరోస్ సెట్‌లో తన తండ్రి మోహన్‌లాల్‌ని కలవడానికి ప్రణవ్ ఉబర్‌లో చాలా సామాన్యుడిగా వచ్చాడు. సెక్యూరిటీ గార్డులు ప్రణవ్ ను ఆపి, షూటింగ్ లొకేషన్‌లోకి ఎవరినీ రానివ్వకూడదని మోహన్‌లాల్‌కి కట్టుదిట్టమైన ఆదేశాలు చేశారని ప్రణవ్ తో అన్నారని అలెప్పీ అష్రఫ్ వివరించారు. ఇందుకే సెక్యూరిటీ ప్రణవ్‌ను ఆపింది. ప్రణవ్ ఎవరో వారికి తెలియదు. సెక్యూరిటీ ప్రశ్నకు ప్రణవ్ తన తండ్రిని చూడటానికి వచ్చానని చెప్పాడు. అయితే అతను చెప్పింది వాళ్ళు అబద్దం అనుకోని లోపలికి అనుమతించలేదు. ప్రణవ్ వాళ్ళతో వాదించకుండా.. ఏమీ మాట్లాడకుండా నవ్వుతూ నిలబడ్డాడు. కొంత సమయం తరువాత, సెక్యూరిటీకి అనుమానం వచ్చింది. ఒక కుర్రాడు తన తండ్రిని చూడటానికి వచ్చాడని షూటింగ్ బృందానికి తెలియడంతో.. అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్ , డైరెక్టర్ అనీష్ వెళ్లి చూడగా అది ప్రణవ్. ప్రణవ్ ఎవరో తెలియగానే సెక్యూరిటీ కూడా ఆశ్చర్యానికి లోనయ్యారని అష్రఫ్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *