బాపట్లలో విషాదం..నడుముకు బాటిళ్లను కట్టుకుని..?
బాపట్ల జిల్లా పర్చూరులోని వీరన్నపాలేంలో విషాద ఘటన చోటుచేసుకుంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న పాలేరు జస్వంత్, ఇంటర్ సెకండియర్ చదువుతున్న మణికంఠ, డిప్లొమా చదువుతున్న రామరాజు ముగ్గురు ప్రాణ స్నేహితులు. వీరు ముగ్గురు ఖాళీ వాటర్ బాటిళ్లను నడుముకు కట్టుకుని నీటిలో దిగారు. ఆ సమయంలో జస్వంత్ కట్టుకున్న బాటిళ్ల తాడు ఊడిపోవడంతో లోతైన చెరువు నీటిలో మునిగి గల్లంతయ్యాడు. మణికంఠ, రామరాజు ఒడ్డుకి చేరుకొని ఒక్కసారిగా కేకలు వేయడంతో గ్రామస్తులు అందరూ అక్కడికి చేరుకుని…