మగవాళ్లకు మాత్రమే..ఆ సమస్యకు చెక్ పెట్టండిలా..!

వింటర్ సీజన్ లో ఆకు కూరలు తింటే చర్మానికి, ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలిసిందే. ఆకు కూరలన్నీ ఆరోగ్యానికి మంచివే కానీ.. ఈ ఆకు కూర తింటే మాత్రం మగవాళ్లకు ఎంతో హెల్ప్ అవుతుంది. అదే పొన్నగంటి కూర.. దీంట్లో శరీరానికి అవసరమైన అనేక పోషకాలు ఉన్నాయి. మగవారు ఈ ఆకుకూర ఒక్కటి తింటే.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ కూరలో విటమిన్లు సి, ఎ, బి6, ఫొలేట్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, రైబోఫ్లవిన్ వంటి…

Read More

స్వెటర్‌ వేసుకొని నిద్రిస్తున్నారా..?

వింటర్ లో చ‌లిని త‌ట్టుకుని ఉండేందుకు చిన్నా, పెద్ద అంద‌రూ రాత్రింబ‌గ‌ళ్లు స్వెట‌ర్స్ ధ‌రిస్తారు. కొంతమందికి అయితే స్వెట‌ర్ వేసుకొని మరీ నిద్రించే అల‌వాటు ఉంటోంది. అయితే స్వెట‌ర్ వేసుకొని నిద్రించ‌డం మంచిది కాద‌ని అంటున్నారు వైద్య నిపుణులు.  స్వెట‌ర్ వేసుకుని నిద్రించ‌డం వ‌ల్ల శ‌రీర ఉష్ణోగ్రతలు బ‌య‌ట‌కు వెళ్ల‌లేక‌పోతాయట. దాంతో ర‌క్త పోటు స్థాయిలు పెర‌గ‌డం లేదా త‌గ్గ‌డం వంటివి జ‌రుగుతాయి. ఫ‌లితంగా క‌ళ్లు తిర‌గ‌డం, మైకం, త‌ల నొప్పి వంటి స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయంటున్నారు నిపుణులు….

Read More

వింటర్ లో స్కిన్ డ్రైగా మారుతుందా..?  

చలికాలంలో మన చర్మం డ్రైగా, పొలుసు బారినట్టు మారిపోతుంది. అలాగే తేమ కూడా తగ్గిపోయి.. నిర్జీవంగా మారుతుంది. చలి గాలుల వల్ల పగలటం, పొడి బారటం, మంట పెట్టడం, దురద పెట్టడం వంటి సమస్యలు తలెత్తుతాయి. డ్రై స్కిన్ ఉన్న వారికి మరీ ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి వారు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి వద్దే ఉండే వాటితో కొన్ని రకాల టిప్స్ పాటిస్తే చాలు. అవేంటో తెలుసుకుందాం. కొబ్బరి నూనె..ఇది మన స్కిన్ కేర్ లో…

Read More

ఆ సమయంలో వాంతులు అవుతున్నాయా..?

మనలో చాలా మందికి ప్రయాణం అంటే వాంతుల భయం పట్టుకుంటుంది. ఈ భయంతోనే ఏమీ తినకుండా ప్రయాణం చేస్తారు. ఇలాంటి సమస్యలకు కొన్ని ఆయుర్వేద చిట్కాలు ఫాలో అవుతే చాలు. అవేంటో తెలుసుకుందాం..సోంపు గింజలు దాదాపు అందరి ఇళ్లలో ఉంటాయి. సోంపు తింటే తిన్న ఆహారం అరగడమే కాకుండా వికారం, వాంతులు వంటి లక్షణాలను తగ్గిస్తుంది. మీరు ప్రయాణం చేసేటప్పుడు సోంపును కూడా వెంట తీసుకెళ్లండి. ప్రయాణంలో సోంపును తింటే ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. అలాగే…

Read More

చలి కాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

బాబోయ్ వింటర్ సీజన్ వచ్చేసింది. వాతావరణంలోనే కాదు.. ఇప్పుడు శరీరంలోనూ కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. చలి తీవ్రతను బట్టి మన శరీరంలో హీట్ అనేది తగ్గిపోతుంది. శరీరం పొడి బారిపోతుంది.. తేమను కోల్పోతుంది. పైగా జుట్టు సమస్యలు కూడా తలెత్తుతాయి. జుట్టు రాలిపోతూ చిరాకుగా ఉంటుంది. ఇవే కాదు ఈ వింటర్ సీజన్ లో తగిన జాగ్రత్తలు తీసుకుకోకుంటే అంతే సంగతి. మనం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా ఆహార విషయంలో జాగ్రత్తగా…

Read More

హెచ్చరిక..మీకు ఆ అలవాటు ఉందా..?

మనలో చాలా మంది రాత్రి ఆలస్యంగా పడుకుంటారు. కొంత మంది రాత్రి పూట అధిక సమయం వేచివుండి వర్క్‌ చేస్తుంటారు. మరికొంతమంది మాత్రం సోషల్ మీడియాలో గంటల కొద్ది సమయం గడుపుతూ మేల్కొని ఉంటారు. అయితే దీని వల్ల మన శరీర గడియారంలో అనేక దుష్ప్రభావాలు పడుతాయని వైద్య నిపుణులు అంటున్నారు. మన శరీరానికి దాని సొంత గడియారం ఉంటుందట. ఆ రొటీన్‌లో ఒక్కసారి బ్రేక్ పడితే ఇక అంతే సంగతి..చక్కదిద్దుకోవడానికి చాలా కష్ట పడాల్సి వస్తుందంటున్నారు….

Read More

ప్రతి రోజు ఇవి తింటే అద్భుత ప్రయోజనాలు..!

యాలకుల్లో ఎన్నో ఔషధాలు గుణాలు ఉండడం వల్ల వాటిని తినాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తుంటారు. యాలకుల్లో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. సాధారణంగా స్వీట్స్, పులావ్, బిర్యానీ, హల్వాలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. రుచి కోసం అనే చాలా వరకు తెలుసు కానీ మనకు తెలియని ఔషధాల గుణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  యాలకులు తినడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది. అలాగే నిత్యం నమలడం వల్ల నోటి దుర్వాసన పోయి నోరు తాజాగా…

Read More

మీ కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా ?

మనలో చాలా మంది కళ్లపట్ల ఆ జాగ్రత్తగా ఉంటారు. అనవసరంగా గంటల తరబడి ఫోన్లు, ల్యాప్ టాప్ ల ముందు కూర్చుని కళ్లకు రక్షణ, రెస్ట్ లేకుండా చేస్తున్నారు. దీంతో కళ్ల రక్షణ కణాలు దెబ్బతింటున్నాయి. చాలా మంది చిన్నపిల్లలకు కూడా తొందరగా సైట్ వచ్చేస్తుంది. ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్లు స్క్రీన్ ని అదే పలంగా గంటల తరబడి చూడటం వల్ల కళ్లపై ఎక్కువగా ఒత్తిడి పడుతుంది. కాబట్టి కళ్లను కూడా ఆరోగ్యంగా…

Read More

ఆ సమస్యలకు చెక్ పెట్టండిలా..!

ప్రస్తుత కాలంలో అజీర్తి, గ్యాస్‌ సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. జంక్‌ఫుడ్స్‌, ఫాస్ట్‌ఫుడ్స్‌ లాంటి ఆహార పదార్థాలు తరచూ తీసుకోవడం వల్ల జీర్ణాశయానికి సంబంధించిన గ్యాస్‌, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం తదితర సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యల నుంచి త్వరగా బయటపడడానికి మనం ఇంట్లో సులువుగా కొన్ని చిట్కాలను ఉపయోగించి ఉపశమనం పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. మన ఇంట్లో ఉండే వాముతో జీర్ణాశయ ఇబ్బందులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చట. వాము వల్ల జీర్ణాశయానికి చాలా లాభాలు ఉన్నాయంటున్నారు….

Read More