ఆదివారం అర్ధరాత్రి ఒక్కసారిగా కుప్పకూలిన భవనం

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఘోరం జరిగింది. గార్డెన్ రీచ్ ఏరియాలోని ఓ కాలనీలో ఆదివారం అర్ధరాత్రి దాటాక నిర్మాణంలో ఉన్న 5వ అంతస్తుల భవనం కుప్పకూలింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని..క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. పది మందిని రక్షించగలిగారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More

ప్రజలను మైమరిపిస్తున్న అండర్‌ వాటర్‌ మెట్రో !

దేశంలోనే మొట్టమొదటి నదీ గర్భ మెట్రో.. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో నిర్మించిన ఈ నదీగర్భ మెట్రోను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవలే ప్రారంభించారు. తాజాగా ఈ మెట్రో కార్యకలాపాలు పబ్లిక్‌కు అందుబాటులోకి వచ్చాయి. శుక్రవారం ఉదయం నుంచి మెట్రో రైడ్‌కు ప్రయాణికులను అనుమతిస్తున్నారు. దీంతో ఈ మెట్రోలో ప్రయాణించేందుకు స్థానికులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ అండర్‌ వాటర్‌ మెట్రోలో ప్రయాణించి థ్రిల్‌ను ఫీల్‌ అవుతున్నారు. ఈ మెట్రోను అందుబాటులోకి తెచ్చినందుకు ప్రయాణికులు ముందుగా ప్రధాన…

Read More