• Home
  • Health
  • స్వెటర్‌ వేసుకొని నిద్రిస్తున్నారా..?
Image

స్వెటర్‌ వేసుకొని నిద్రిస్తున్నారా..?

వింటర్ లో చ‌లిని త‌ట్టుకుని ఉండేందుకు చిన్నా, పెద్ద అంద‌రూ రాత్రింబ‌గ‌ళ్లు స్వెట‌ర్స్ ధ‌రిస్తారు. కొంతమందికి అయితే స్వెట‌ర్ వేసుకొని మరీ నిద్రించే అల‌వాటు ఉంటోంది. అయితే స్వెట‌ర్ వేసుకొని నిద్రించ‌డం మంచిది కాద‌ని అంటున్నారు వైద్య నిపుణులు. 

స్వెట‌ర్ వేసుకుని నిద్రించ‌డం వ‌ల్ల శ‌రీర ఉష్ణోగ్రతలు బ‌య‌ట‌కు వెళ్ల‌లేక‌పోతాయట. దాంతో ర‌క్త పోటు స్థాయిలు పెర‌గ‌డం లేదా త‌గ్గ‌డం వంటివి జ‌రుగుతాయి. ఫ‌లితంగా క‌ళ్లు తిర‌గ‌డం, మైకం, త‌ల నొప్పి వంటి స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయంటున్నారు నిపుణులు. పైగా చ‌ర్మానికి స‌రిగ్గా గాలి త‌గ‌ల‌దు. తేమ కూడా త‌గ్గి పోతుంది. దీంతో చ‌ర్మం పొడి బారి పోయి ఎండిపోయిన‌ట్టు అయిపోతుంది. అంతే కాదు.. ఇలా చేయడం వల్ల శరీరంలో ఆక్సిజన్‌ సరఫరా కూడా త‌గ్గిపోతుంది. ఆక్సిజన్‌ సరఫరా త‌గ్గిపోవ‌డం వ‌ల్ల ఊపిరి పీల్చుకోవడానికి కష్టంగా ఉండటం, ఛాతి నొప్పి పుట్ట‌డం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి వాటిని ఫేస్ చేయాల్సి ఉంటుంది. 

ఇక గుండె సంబంధిత జ‌బ్బుల‌తో బాధప‌డుతున్న వారు, షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు స్వెట‌ర్ వేసుకుని నిద్రించ‌కపోవ‌డ‌మే మంచిద‌ని అంటున్నారు వైద్య నిపుణులు. లేకుంటే ఆయా స‌మ‌స్య‌లు మ‌రింత తీవ్రంగా మారే అవ‌కాశం ఉంటుందట. చ‌లి తీవ్రంగా ఉండి ఖ‌చ్చితంగా స్వెట‌ర్ వేసుకోవాలి అనుకుంటే.. కాస్త పల్చగా ఉండే స్వెటర్ ను ఎంచుకుని వేసుకోవడం మంచిదంటున్నారు. లేకుంటే మీరు నిద్రించే రూమ్ లో రూమ్ హీట‌ర్​ ను ఏర్పాటు చేసుకోవ‌చ్చంటున్నారు. త‌ద్వారా చ‌లి పెట్ట‌కుండా ఉంటుంది. పైగా స్వెట‌ర్ ధరించాల్సిన అవసరం ఉండదంటున్నారు నిపుణులు. 

గమనిక: ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాం. ఫాలో అయ్యే ముందు వైద్యుల్ని సంప్రదించడం మేలు. 

Releated Posts

నడుం నొప్పి పోవాలంటే ఏం చేయాలి ?

మనలో చాలా మంది నేలపైన కాకుండా బెడ్ పైన పడుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. వీళ్లు అందరూ చెప్పే కారణం ఒక్కటే రోజంతా కష్టపడి…

ByByTrinetra Mar 26, 2024

వింటర్ లో ఆ సమస్యలకు ఇంటి చిట్కాలతో చెక్..!

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s

ByByTrinetra Sep 8, 2022

మగవాళ్లకు మాత్రమే..ఆ సమస్యకు చెక్ పెట్టండిలా..!

వింటర్ సీజన్ లో ఆకు కూరలు తింటే చర్మానికి, ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలిసిందే. ఆకు కూరలన్నీ ఆరోగ్యానికి మంచివే కానీ.. ఈ ఆకు…

ByByTrinetra Sep 8, 2022

వింటర్ లో స్కిన్ డ్రైగా మారుతుందా..?  

చలికాలంలో మన చర్మం డ్రైగా, పొలుసు బారినట్టు మారిపోతుంది. అలాగే తేమ కూడా తగ్గిపోయి.. నిర్జీవంగా మారుతుంది. చలి గాలుల వల్ల పగలటం, పొడి…

ByByTrinetra Sep 7, 2022
1 Comments Text
  • 8833betlogin says:
    Your comment is awaiting moderation. This is a preview; your comment will be visible after it has been approved.
    Hey folks, tried out 8833betlogin recently. It is great, the bonuses you get when you register are pretty good, and I won on the first few bets! Check it out for yourself here: 8833betlogin
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *